జై భారత్ వాయిస్ సంగెం : సంగెం మండలంలోని ముమ్మిడివరం గ్రామములోని సిద్ధార్థ హై స్కూల్ లో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా మంగళవారం జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు విద్యాబోధన చేశారు. డిఈఒ గా పృద్వి, హెడ్ మాస్టర్ గా వీక్షిత్, ఇంచార్జిగా రిషిత, టీచర్లుగా వ్యవహరించారు. బోధనలో ఉత్తమ ప్రతిభగల పిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తీగారపు సుధాకర్, ఇంచార్జి ఫిజానాస్, టీచర్లు నాగమణి, వందన, స్వప్న, కవిత, మౌనిక, శాంత కుమారి, ప్రవళిక, రాధిక తదితరులు పాల్గొన్నారు.

previous post