Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

వైద్యం కోసం 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం బద్దె నాయక్

పక్షవాత భాదితుడికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చేయూత

వైద్యం కోసం 12,000 రూపాయలు అందజేసిన చైర్మన్ బద్దేనాయక్

జై భారత వాయిస్ కళ్యాణదుర్గం

కళ్యాణదుర్గం పట్టణంలోని మారెంపల్లి కాలనీలో నివసిస్తున్న నిరుపేద ముస్లిం కుటుంబానికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ వైద్య సహాయం నిమిత్తం 12,000 రూపాయలు వారికి అందజేసిన ట్రస్ట్ చైర్మన్ మరియు సభ్యులు… ఈ సందర్భంగా చైర్మన్ బద్దేనాయక్ మాట్లాడుతూ జీలాన్ అనే వ్యక్తి పక్షవాతానికి గురై సంవత్సరోజులుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు కనీసం వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని మా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ కు తెలియడంతో  సభ్యుల అందరూ కలసి వారికి నేడు వైద్య సేవల నిమిత్తం 12,000 రూపాయల చెక్ ను అందించడం జరిగింది. అలాగే వారికి నిత్యావసర సరుకులు కూడా అందిస్తాం అని తెలియజేశారు.ట్రస్ట్ తరుపున అతడికి మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తామని వాళ్ల భార్య నసీమా తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్  సభ్యులు తిప్పేస్వామి,హరి,లోకేష్,సురేష్,సాయి,అచ్యుత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు…

Related posts

సరైన మౌలిక వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

Gangadhar

ప్రజలకు సేవ అభివృద్ధి మంచి పథకం కల్పిస్తాం

Jaibharath News

ఎన్టీఆర్ రామారావు గారి జన్మదిన వేడుకలు

Jaibharath News