దుగ్గొండి:మండలంలోని మందపల్లి ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటు చేశారు. స్థానిక మహిళా సమాఖ్య స్ఫూర్తి వివో అధ్యక్షురాలు మేదరి పద్మ చైర్మన్ గా, పాఠశాల హెడ్మాస్టర్ కర్ణకంటి రాంమూర్తి కన్వీనర్ గా వ్యవహరించనున్న మందపల్లి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యురాళ్లుగా రాంపాక జ్యోతి,మాతంగి శైలజ,కనుకుల శైలజ,మొలుగూరి రాణి, తుమ్మలపల్లి మౌనిక,రేణుకుంట్ల కోమల, రేవూరి సుమలత,పెండ్యాల జ్యోతి ఎంపికయ్యారు. ఈకార్యక్రమంలో స్థానిక పాఠశాల ఉపాధ్యాయురాలు నిర్మల,పంచాయతీ కార్యదర్శి రాగి ప్రవీణ్ కుమార్, విఓఏ అంబరగొండ మధురాబాయి, అంగన్వాడీ కార్యకర్త గ్రేస్, ఆయా షాహిన్ తదితరులు పాల్గొన్నారు.