Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి కళ్యాణం వైభవంగా జరిగింది

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలంలోని  కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి కళ్యాణం గురువారం రాత్రిఅంగరంగ వైభవంగా జరిగిం ది. గీసుకొండ, దుగ్గొండి మండలంలోని వివిధ గ్రామాలభక్తులు అధిక సంఖ్యలో  వేడుకకు హాజరై తిలకించారు. కళ్యాణానికి ముందు  గుట్టపైన ఆలయంలో నిత్య హోమము భేరీ పూజ కల్యాణానికి సమస్త దేవతలను ఆహ్వానించే పూజలు దేవాలయ వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసచార్యులు కాండూరి రామాచార్యులు  నిర్వహించారు. . వేదమంత్రాల నడుమ కల్యాణలో  మాంగళ్యధారణ, తలంబ్రాలు బాజా భజంత్రీల మధ్య ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసా చార్యులు,  రామాచార్యు లు, విష్ణుఆచార్యులు, ఫణీంద్రాచార్యులు, నిర్వహించారు
ఈ కార్యక్రమంలో గీసుకొండ  ఎం పీపీ భీమగాని సౌజన్య, ఎంపీటీసీ గోపాల్, కాం గ్రెస్ నాయకులు చాడ కొమురారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాస్  సాయిలి ప్రభాకర్, అంతకి నాగేశ్వరరావు, స్వామి, అమ్మి,రాజయ్య దేవాలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు 

Related posts

మంత్రి కొండా సురేఖకు జాతర ఆహ్వాన పత్రిక అందచేత

Jaibharath News

ఎన్నికల నిర్వహణకు పక్కడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.

ఎ. జ్యోతి

వరంగల్ రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు