జై భారత్ వాయిస్ వరంగల్
సంగెం మండలం తో పాటు 17వ డివిజన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ గ్రామ,బూత్ స్థాయి నాయకులతో గీసుకొండ మండలంలోని నర్సంపేట రోడ్ లోని ఊకల్ వద్దగల ఎస్ ఎస్ గార్డెన్స్ లో శనివారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పోలింగ్ బూత్ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో.గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పోలింగ్ బూత్ ల వారిగా సమీక్షించారు. అనంతరం.వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో తన గెలుపు కోసం అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పట్టుదలతో కసితో పని చేసిన కార్యకర్తలను, నాయకులను అభినందించారు.ఇదే పట్టుదల కసితో రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రజలు బీ ఆర్ ఎస్ ను బొండపెడుతారని బీజేపీని తరిమి కొడతారని ప్రజల ఆశీస్సులతో కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతుందని వరంగల్ పార్లమెంటు స్థానాన్ని గెలిపించుకుంటే మరిన్ని నిధులతో అభివృద్ధి చేసుకోవచ్చని ఎమ్మెల్యే అన్నారు.మీరు పార్టీకి అండగా ఉండండి నేను మీకు తోడుగా ఉంటా అని కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటానని లీడర్ కంటే క్యాడర్ కు ప్రాధాన్యతను ఇస్తానని బ్లాక్ మెయిల్ రాజకీయాలను సహించాలని గ్రూపులు కట్టవద్దని క్రమశిక్షణతో ముందుకు పోవాలని వ్యక్తిగత విభేదాలకు తావు లేకుండా పార్టీ లైన్ లోనే ప్రతి కార్యకర్త పనిచేయాలని బాధ్యతారాహిత్యాన్ని తాను సహించనని అన్నారు. మీ గ్రామ బూతు లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లే మీ పని విధానం తెలుస్తుందని గత అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓట్లు వచ్చిన గ్రామాలపై మండల నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టి సమీక్షించాలని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అయ్యేవరకు మండల నాయకత్వం గ్రామాల్లోనే ఉండి కార్యకర్తలకు చైతన్యం చేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కోరారు.
previous post