జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలం మనుగొండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 93 వ భగత్ సింగ్ వర్ధంతి వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి
ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ నాయకులు అల్లం బాలకిశోర్ రెడ్డి భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగత్ సింగ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ నెరవేర్చాలని కోరారు. ఈకార్యక్రమంలో గీసుకొండ మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆకుల రుద్ర ప్రసాద్ గీసుకొండ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పవన్ యుండి రాము రాజారామ్ రాజ మోగిళి ఓదేలు రాజు స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు