Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

వైభవంగా చెన్నకేశవస్వామి కళ్యాణ మహోత్సవం

హనమకొండ జిల్లా దామెర

మండలం కోగిల్వాయి శివారులోని చంద్రగిరి గుట్టల మీద చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగ ణంలో గోవిందా. నామస్మరణతో స్వామి వారి కల్యా జోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించారు. సోమ వారం ఉదయం ఆలయ ప్రధానార్చకులు దీని వెంకటజోగాచార్యులు, నర్సింహాచార్యులు, మురళీధ రాచార్యులు, కేశవాచార్యులు తదితర వేద పండి తుల మంత్రోశ్చరణలతో ప్రాతఃకాల ప్రత్యేక పూజా ధికాలతో కల్యాణోత్సవ క్రతువు ప్రారంభించారు. ఆ తరువాత గుట్టపై ఉన్న పెద్ద గుండం(కోనేరు) చుట్టూ పల్లకిలో చెన్నకేశవస్వామి వారితో పాటుగా ప్రదక్షిణలు చేశారు. అలాగే మధ్యాహ్నం 12.01గంటల తరువాత క్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి వారిని ఆలయ కల్యాణ మండ పంలో శాస్త్రోక్తంగా, సంప్రదాయ రీతిలో కల్యాణోత్స వాలను నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామి వారికి ముందుగా విశ్వక్షేన ఆరాధన, పుణ్యాహవ చనం వంటి ప్రధాన క్రతువును జరిపించారు. అదేవిధంగా స్వామి వారికి అభిషేకాలు, విశేష సహ ప్ర నామార్చనలు, పం చామృతాలతో అభిషేకం. నిర్వహించి, పసుపు, కుంకుమలు సమర్పిం చారు.గుట్టపై దేవాలయానికి పక్కనే ఉన్న పెద్ద గుండం(కోనేరు)లో భక్తులు పుణ్య స్నానాలు ఆదరించి, కల్యాణోత్సవం లో పాల్గొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సంద రస్రంగా సర్వాపురం గ్రామానికి చెందని పింగిలి పవన్ రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే జాతర నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో స్వామి వారికి మంగళసూత్రాలు, మట్టె లు సమర్పించారు. కాగా, గ్రామంలోని యువత, గ్రామ పెద్దల సహకారంతో గోల్కొండ సతీష్ భక్తుల ఆధ్వర్యంలో భక్తులకు మహాఅన్నదానం ఏర్పాటు చేశారు. గజ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నకేశవ స్వామి జాతర చైర్మన్ గుండా సురేష్ దంపతులు, వైస్ చైర్మన్ పాలకుర్తి అశోక్ దంపతులు, ఎంపీటీసీ సంగనబోయిన మౌనికకిరణ్, ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Related posts

గడప గడపకు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం

5వేల కోట్ల నిధులతో రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలి

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతఆత్మకూరు ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి