జై భారత్ వాయిస్ గీసుకొండ
పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ జెండాను ఎగరవేయడమే ఏజెండాగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
పిలుపునిచ్చారు.వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మరియాపురం గ్రామంలో ఆదివారం గ్రామ తాజా మాజీ సర్పంచ్ బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు అల్లం బాల్ రెడ్డి తో పాటు భారీ బీఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జి కత్తి వెంకటస్వామి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికలు చివరి ఎన్నికలన్నారు. గతంలో తమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకొని నేడు నీతులు మాట్లాడడం సరికాదని ఆరోపించారు.లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ అని. రాష్ట్రంలో 13-14 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ లోకసభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచి తీరుతుందని రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీజేపీతోనే పోటీ అని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన వాగ్ధానాలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని, బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావని, ఆ పార్టీ జూన్ తర్వాత కనిపించదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.ఈకార్యక్రమంలో గ్రామ పార్టీ పెంటరెడ్డి జాజిరెడ్డి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కత్తి వెంకటస్వామి ఎంపీపీ భీమాగాని సౌజన్య ,జిల్లా అధికార ప్రతినిధి రావుల శ్రీనువాస్ రెడ్డి పరకాల అధికార ప్రతినిధిలు చాడ కొమురారెడ్డి, జనగాం శీనువాస్, ప్రొఫెసర్ దయాకర్, కొండేటి కొమురారెడ్డి, మాధవరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు దూపకి సంతోష్ మాజీ సర్పంచ్ రవీందర్, దూలంవేంకటేశ్వర్లు, మర్రిరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆకుల రుద్రప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జావిద్ కూసం రమేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు గోరె రాజు, సాంబరెడ్డి, రమేష్. గీసుకొండ గ్రామ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ ఊకల్ గ్రామ పార్టీ అధ్యక్షుడు నాగరాజు అనిల్ అభినవ్ రాజీవ్ మరియ పురం కాంగ్రెస్ పార్టీ నాయకులు దిలీప్ శివ ప్రసాద్ రాజు దశరత్ ,సతిష్ ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు