Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

పెంచికలపెట లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం
– వరి ధాన్యం రైతులు సద్వినియోగం చేసుకోవాలి
– వ్యవసాయ సహకార సంఘం సీఈవో లక్ష్మయ్య
జై భారత్ వాయిస్ ఆత్మకూరు
ఆరుగాలం శమించి పండించిన పంటను మధ్య దళారులకుఅన్ని నష్టపోవద్దని రైతులకు అందుబాటులోనే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని వ్యవసాయ సహకార సంఘం సీఈవో ఓదెల లక్ష్మయ్య అన్నారు. సోమవారం ఆత్మకూరు మండలం పెంచికల్ పేట వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని నీరుకుల్ల గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సీఈఓ ఓదెల లక్ష్మయ్య ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ఆర్థికంగా నష్టపోవద్దని దృఢ సంకల్పంతో ప్రభుత్వం రైతులకు అందుబాటులోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ ప్రాంత రైతులందరూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్మకాలు జరుపుకొని ప్రభుత్వ మద్దతు ధర తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహకార సంఘం సిబ్బంది కే చిరంజీవి, జై రఘుపతి, ఎం మల్లికార్జున్, రైతులు హర్షం మూర్తి, అల్లం యాకయ్య, చిర్ర శ్రీకాంత్, హర్షం చిన్న , ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 2203 క్వింటాల్కు మద్దతు ధర, సి గ్రేడ్ కు 2123 మద్దతు ధర ప్రభుత్వ ఇస్తుందన్నారు.

మా చానల్ సబ్స్క్రయిబ్ చేయండి షేర్ చెయ్యగలరు

Related posts

ఛలో హైదరాబాదును విజయవంతం చేయండి. జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్

Sambasivarao

క్యాన్సర్ పేషంట్ల కోసం కేంద్ర ప్రభుత్వ పథకం

అర్హులందరికీ గృహలక్ష్మి పథకం వర్తింపచేస్తాం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.