జై భారత్ వాయిస్ వరంగల్:గీసుకొండ మండలం ఉకల్ లో వరిధాన్యం కోనుగాలు కేంద్రం ను వరంగల్ జిల్లా ఆడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యమును ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని అమ్మి మద్దతు ధర పొందాలని ఆమె రైతులకు సూచించారు ఏ గ్రేడ్ వరి ధాన్యం కు రెండువేల రెండు వందల మూడు రూపాయలు సాధారణ రకం దాన్యం కు 2183 రూపాయలు ప్రభుత్వం మద్దతు కేటాయించిదని అన్నారు. రైతులు మద్య దళారుల వద్ద ధాన్యమున అమ్మి మోసపోవద్దని ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించి రైతులుమద్దతు ధర పోందాలని అన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా ప్యాడి పొక్యూర్ మెంట్ కమిటీ సభ్యులు జిల్లా సహకార అధికారి బి సంజీవరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ఉషా దయాల్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రసాద్ రావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారిణి కౌసల్యాదేవి, జిల్లా సివిల్ సప్లై అధికారిణి సంధ్యారాణి, లీడ్ బ్యాంకు మేనేజర్ రాజు ఊకల్ హవేలీ రైతు సేవా సహకార సంఘం సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు.

previous post