Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల  నిర్వహణ బాధ్యతలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య  జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వాటి నిర్వహణ గురించి కమిటీ సభ్యులకు పాఠశాల ప్రాధానోపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు పాఠశాలలో పారిశుద్యం, తరగతి గదులు మరమ్మతులు, విద్యుత్ సౌకర్యం లైటింగ్ తాగునీరు కు సంబందించి పనులు చేయుటకు అవగాహన కల్పించారు  రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఈ కమిటీలు పాఠశాలలో అభివృద్ధి పనులను  ఈ కమిటీలు నిర్వహణ చేస్తారని ఆమె వివరించారు జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి మాట్లాడుతూ జిల్లాలలో పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు కమిటీల నిర్వహణపై  అవగాహన సదస్సులు కూడా జిల్లాలో నిర్వహిస్తున్నామని తెలిపారు  ఈ కార్యక్రమంలో గీసుకొండ ఎంఈఓ చదువుల సత్యనారాయణ   ఎం ఎన్ ఓ రవిందర్ ఎఈ సుధాకర్ ఎపిఓ సురేష్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వైస్సార్ 15వ వర్ధంతి సందర్బంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యేలు, కుడా చైర్మన్, డీసీసీ అధ్యక్షురాలు

నెక్కొండ మండలం వెంకటాపురం వాగులో చిక్కుకున్న బస్సులోని ప్రయాణికులను కాపాడిన లారీ డ్రైవర్

6 గ్యారంటీలు బైబిల్ ఖురాన్ భగవద్గీతతో సమానంమంత్రి కొండా సురేఖ