Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఆత్మకూరు హై స్కూల్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం………

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు )
సుదీర్ఘ కాలము తరువాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో విద్యార్థులు,ఉపాధ్యాయులు ఒకే వేదికపై పాలు పంచుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఈ అపూర్వ ఘట్టం ఆత్మకూర్ హై స్కూల్ లో జరిగింది. ఆదివారం ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో 1998- 1999 పదవ తరగతి ఏ బి సి డి 4 సెక్షన్ల 200 మంది పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాల అనంతరం ఒకే వేదికపై అప్పటి ఉపాధ్యాయులతో కలిసి వారి తీపి గుర్తులను పాలుపంచుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను, ఉపాధ్యాయులతో కలిసి నెమ్మరు వేసుకున్నారు. ఎన్నో మరుపురాని ఘట్టాలను గుర్తు చేసుకుంటూ వారి ఆనందాలకు అదుపు లేకుండా పోయింది. ఈ వేదికపై అప్పటి ప్రధానోపాధ్యాయులు పైడిముక్కల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు ఎంతో విలువ ఉండేదని ఇక్కడ చదువుకున్న విద్యార్థులే ఎన్నో ఉన్నత ఉద్యోగాలలో వ్యాపార రంగాలలో రాణిస్తున్నారని అన్నారు.కార్పొరేట్ విద్యా వ్యవస్థలు వచ్చి ప్రభుత్వ పాఠశాలలను దెబ్బతీశాయాన్ని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా అభివృద్ధి చేసుకునే బాధ్యత పూర్వ విద్యార్థులపై ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులే ఉన్నత ఉద్యోగాలు రాణిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలను సరస్వతి నిలయాలుగా మార్చడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్, అప్పటి ఉపాధ్యాయులు నిర్మలాదేవి, రమణాచారి, వేణుగోపాల్, సాంబయ్య, మోహన్ రెడ్డి, రామస్వామి, జనార్దన్ రెడ్డి, గోపాల్ రెడ్డి ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థులు పూలమాలలు వేసి శాల్వులతో సత్కరించి, పుష్పాలతో వాళ్ల పాదాభి షేకాలు చేశారు. అప్పటి గురువుల ఆశీస్సులు అనుగ్రహాన్ని పొందిన విద్యార్థులు ఎనలేని అనుభూతిని పొందారు. ఈ వేడుకల్లో పాల్గొన్న పూర్వ విద్యార్థులు ఉద్యోగులు వ్యాపారులు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు.

Related posts

గృహలక్ష్మి లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందించిన ఎమ్మేల్యే

Jaibharath News

గంజాయి నుండి యువతను కాపాడుకుందాం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయము ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి