కోనాయమాకులలో పోచమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు వివరాలకు వెళ్తే గీసుకొండ మండలంలోని కోనాయమాకులలో ఉగాది పర్వదినమున పోచమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గీసుకొండ క్రాస్ రోడ్ నుంచి మహిళలు బోనాలతో కోనారమాకుల బొడ్రాయి మీదుగా పోచమ్మ గుడి వద్దకు తరలివచ్చి అమ్మవారికి బోనాలను నైవేద్యంగా సమర్పించారు. చిరె సారెను సమర్పించారు ఎడ్ల బండ్లకువేప కొమ్మలు కట్టిశోభాయమానంగా ఆలకరించి గుడి చుట్టూ తిప్పారు. ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు ఆటోలు పోచమ్మ గుడి చుట్టూ తిరిగాయి . ఈ కార్యక్రమంలో గీసుకొండ జడ్పిటిసి పోలీసు ధర్మారావు, మాజీ సర్పంచ్ డోలే రాధాబాయ్ చిన్ని గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
previous post