జై భారత్ వాయిస్ వరంగల్
ప్రజాస్వామ్య పరిరక్షణ కు ఓటే ఆయుధం అని వరంగల్ జిల్లా స్వీప్ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు.
లోక్ సభ ఎన్నికల నేపద్యం లో 15- వరంగల్ లోక్ సభ నియోజక వర్గ పరిధి 106–వరంగల్ (తూర్పు) నియోజక వర్గానికి సంబందించి స్వీప్-2024(సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ & ఎలక్టోరల్ పార్టిసిపేషన్) అవగాహన కార్యక్రమం లో భాగం గా గురువారం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో లీడ్ బ్యాంకు వారి సహకారంతో ముగ్గుల పోటీలను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథి గా స్వీప్ నోడల్ అధికారి తో కలిసి అదనపు కమిషనర్ అనుసుర్ రషీద్ తో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనంతరం వరంగల్ జిల్లా నోడల్ అధికారి మాట్లాడుతూ వరంగల్ జిల్లా పరిధిలో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి వినూత్నంగా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, ముగ్గుల ద్వారా ఓటర్లలో చైతన్యం తేవడానికి మెప్మా ఆధ్వర్యం లో లీడ్ బ్యాంక్ వారి సహకారం తో పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజలకు ఓటింగ్ ప్రాధాన్యాన్ని తెలియజేయడం, ప్రజలు పెద్దయెత్తున పోలింగ్ లో పాల్గొని ఓటింగ్ శాతాన్ని పెంచడం, ప్రజాస్వామ్యం అనునది ఓటు హక్కు ద్వారా మాత్రమే సాధ్యమని, ఓటు హక్కు మన ప్రాథమిక బాధ్యత మరియు విధి అని రానున్న ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలి అంటే ఓటు వేయడం అత్యంత ముఖ్యమని, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అంటారని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలలో మన దేశం ఒకటని, ఓటును వినియోగించుకోవడం ద్వారానే ప్రజా ప్రభుత్వంలో ప్రజలు భాగస్వాములు అవుతారని 1988వ సం. నుండి 18 సం.లు నుండిన ప్రతి ఒకరికి కుల మత జాతి వర్గ భాష అనే భేదాలు లేకుండా ఓటు హక్కును ఆర్టికల్ 326 ద్వారా కల్పించడం జరిగిందని, గత ఎన్నికల్లో 62.7% మాత్రమే పోలింగ్ నమోదు కావడం జరిగిందని,37.3% మంది పోలింగ్ కు దూరంగా ఉన్నారని, 100% పోలింగ్ జరిగినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యంగా పేర్కొనడం జరుగుతుందని,ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా పిడబ్ల్యుడి ఓటర్లు మహిళల కు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగిందని,జిల్లా లో యూత్ కోసం ప్రత్యేకం గా పోలింగ్ బూత్ మోడల్ పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేస్తున్నామని, ఓటు వేయడం అందరి బాధ్యత అని తెలియజేయడం కోసం ప్రధాన కూడళ్లలో రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లలో సెల్ఫీ పాయింట్ల ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ విస్తృత ప్రచారాన్ని కల్పిస్తున్నామని నోడల్ అధికారి తెలియజేశారు. ముగ్గుల పోటీలలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతుల తో పాటు పోటీల్లో పాల్గొన్న మహిళలకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను అధికారుల చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొన్న మహిళల చేత ఎన్నికల ప్రతిజ్ఞను నిర్వహింప చేశారు. ఈ కార్యక్రమంలో పోలింగ్ మెటీరియల్ నోడల్ అధికారి విజయలక్ష్మి పిడబ్ల్యూడి చీఫ్ నోడల్ అధికారి సత్య లక్ష్మి సిడిపిఓ విశ్వజ యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సత్యం లీడ్ బ్యాంకు మేనేజర్ రాజు వరంగల్ (తూర్పు) నియోజక వర్గ నోడల్ అధికారి రాజేష్ కుమార్ టిఎంసి రమేష్ ఐ సి డి ఎస్ సూపర్వైజర్ వెంకట రమణి సి ఓ లు తదితరులు పాల్గొన్నారు

previous post
next post