Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మలేరియా పై అవగాహన ర్యాలీ

జై భారత్ వాయిస్ గీసుకొండ
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని  గీసుగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల పరిధిలోని అన్ని ఉప కేంద్రాల పరిధిలో మలేరియా పై అవగాహన ర్యాలీలను నిర్వహించారు.అనంథరం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ అర్చన మాట్లాడుతూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమలు కుట్టకుండా దోమతెరలను వాడాలని సూచించారు ఎవరికైనా జ్వరం వస్తే తక్షణమే సంబంధిత వైద్య సిబ్బందిని సంప్రదించి చికిత్స చేయించుకోవాలని ఆమె అన్నారు.ఈ ర్యాలీలలో వైద్యాధికారి డాక్టర్ అర్చన తోపాటు, సి హెచ్ ఓ  మధుసూదన్ రెడ్డి, సూపర్వైజర్స్  కిరణ్ కుమార్, స్వరూప, అన్ని ఉపకేంద్రాల డాక్టర్లు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్స్,  ఆశా కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్య తో పాటు పౌష్టిక ఆహారం అందించాలి

తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి నియమించాలి…

పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు