Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

బిజెపి అంటే కొత్త అర్థం చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

జై భారత్ వాయిస్ భాగ్యనగరం
బిజెపి అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు బిజెపి భావజాలం ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన భావజాలం ఆర్ఎస్ఎస్ విధానము ఈ దేశంలో రిజర్వేషన్లను రద్దు చేయడం భారతీయ జనతా పార్టీ విధానమని అన్నారు. కాంగ్రెస్సో పార్టీ షల్ మీడియా వారియర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ దేశంలో ఉండే ఎస్సీ, ఎస్టీ ఓ బి సి మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేయాలని వారి లక్ష్యమని అని తెలిపారు. ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదట దేశంలోకి ప్రవేశించింది గుజరాత్ సూరత్ నుంచి మన మధ్యలో సఖ్యతలేని విషయాన్ని గుర్తించి మనకు మనకు పంచాయతీలు పెట్టి ఒకటొకటోకిగా సంస్థానాలను ఆక్రమించుకొని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారని అన్నారు. అదే విధంగా గుజరాత్ సూరతు నుంచి బయలుదేరిన అమిత్ షా మోడీ బ్రిటిష్ విధానాన్ని పాటించి అధికారాన్ని ఉపయోగించి మన మధ్యనే ఉండే చిన్న చిన్న తగదాలను పెంచి పెద్దగా చేసి ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలని అనుకుంటున్నారని బిజెపి అంటే భారతీయ జనతా పార్టీ కాదని అది బ్రిటిష్ జనతా పార్టీ అని ఆవిధానంను అంతా బ్రిటీషర్ నుంచి తీసుకున్నారని చెప్పారు. రిజర్వేషన్లు తీసేయాలని చూస్తున్నారని ఆనాడు బ్రిటిష్ వారు ఉన్నప్పుడు రిజర్వేషన్లు లేవని వివరించారు. రాష్ట్ర మీద దాడి జరుగుతుంది మీరు కష్టపడి తెచ్చిన ప్రభుత్వం మీద కుట్రలు జరుగుతున్నాయని బిజెపి బీఆర్ఎస్ ఒకటైనవి అని సోషల్ మీడియా వారియర్స్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకొసం కష్టపడాలని కొరారు.

Related posts

దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసి తీసుకువస్తాం సిఎం రేవంత్ రెడ్డి

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో జన సందేశ్ డిజిటల్ పత్రిక

Jaibharath News

బీఆర్ఎస్ అధినేత‌, కేసీఆర్ బ‌స్సు యాత్ర తో కాంగ్రెస్, బీజేపీ నేత‌ల గుండెల్లో ద‌డ