జై భారత్ వాయిస్ మంగళగిరి: జగన్ సొంత చెల్లి పసుపుచీర కట్టుకుంటే టిడిపి అంటున్నారు, పసుపుచీర కట్టుకున్న వారంతా టిడిపి అయిపోతారా? ఆయన తల్లి,భార్య కూడా పసుపుచీర కట్టుకున్నారు, రేపు వారు కూడా టిడిపి అంటారేమోనని యువనేత నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంగళగిరి నియోజకవర్గం పెదపాలెం గ్రామ రచ్చబండ సభలో నారా లోకేష్ మాట్లాడుతూ.సొంత తల్లి,చెల్లిని మెడపట్టి గెంటేసిన వాడు రాష్ట్రంలోని మహిళలకేం న్యాయం చేస్తాడో రాష్ట్రప్రజలంతా ఆలోచించాలని లోకేష్ అన్నారు. విజయవాడలో ఎవరో జగన్ పై విసిరారని చెబుతున్నగులకరాయి బాల్ మాదిరిగా జగన్ కు తగిలి, ఆ తర్వాత వెల్లంపల్లి కంటికి తగిలిందట. గులకరాయి వల్ల ఏ శవం లేవబోతుందో చూడాలి. రాబోయే ఎన్నికల్లో ఈ డ్రామాలన్నింటికీ రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పబోతున్నారని లోకేష్ పేర్కొన్నారు.