జై భారత్ వాయిస్ వరంగల్
గ్రేటర్ వరంగల నగరంలో రెండు రొజులపాటు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని ముపిఫల్ అధికారలు తెలిపారు.ధర్మసాగర్ లోని 60 ఎంఎల్ డి రిజర్వాయర్ వద్ద మిషన్ భగీరథ వారు నిర్వహణ పనులు చేస్తున్న కారణం గా వరంగల్ అండర్ రైల్వే జోన్ పరిధి లో ఏప్రిల్ 29 (సోమవారం) నుండి ఏప్రిల్ 30 (మంగళ వారం) మధ్యాహ్నం వరకు నీటి సరఫరా నిపిలివేయడం జరుగుతుందని కావున అట్టి ప్రాంత వాసులు గమనించి వేసవి కాలం నేపద్యం గా నీటిని పొదుపు గా వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సహకరించాలని బల్దియా ఎస్ ఈ ప్రవీణ్ చంద్ర నేడోక ప్రకటన లో కోరారు.ఇట్టి కారణం గా అండర్ రైల్వే జోన్ పరిధిలోని ప్రాంతాలైన కరీమాబాద్, శివనగర్, రంగసాశాయిపేట, శంభునిపేట, తిమ్మాపూర్, సింగారం, మామునూరు, బొల్లికుంట, శాక రాశి కుంట, ఎస్.ఆర్.ఆర్. తోట, ఏకశిలా నగర్, కాశీ కుంట, ఖిలావరంగల్, ధూప కుంట, వసంతపురం, స్తంభం పల్లి, నక్కలపెల్లి, లక్ష్మీపురం, బట్టుపల్లి, కడిపికొండ, రాంపూర్, మడికొండ,దేవన్నపేట ప్రాంతాలలో పైన సూచించిన రోజుల్లో నీటి సరఫరా ఉండదని, ఆయా ప్రాంతాల ప్రజలు సహకరించాలని ఈ సందర్భం గా ఆయన విజ్ఞప్తి చేశారు.
<a href="https://www.sigmatraffic.com?ref=254125">Buy traffic for your website</a>