జై భారత్ వాయిస్ వరంగల్
దేశంలో సుస్థిర పాలన అభివృద్ధి చూసి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల నుండి పెద్దఎత్తున వివిధ పార్టీల నుండి బీజేపీ పార్టీలో చేరడం జరిగింది.. వీరికి వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్, బిజెపి రాష్ట్ర నాయకులు విజయచందర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ పాలనలో ఈ పది సంవత్సరాలు భారత దేశం ఎంతో అభివృద్ధి చెందింది, మన దేశ భవిష్యత్తు ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంది,నరేంద్ర మోడీ ని మరొకసారి ప్రధాని నీ చేసి దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామని పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వుకు గుర్తుకు ఓటు వేసి నన్ను నిండు మనసుతో ఆశీర్వదించాలని అన్నారు.పార్టీలో చేరిన వారిలో.పరకాల మండలం కామారెడ్డి పల్లి గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ మాజీ సర్పంచ్, చక్రపాణి గౌడ్,సాయి కుమార్,కాగితాల సాయి కుమార్.హాసన్ పర్తి మండలం సుధనపల్లి గ్రామ గౌడ సంఘం సభ్యులు మాజీ ఉప సర్పంచ్ కల్లేపు సారయ్య గౌడ్, గట్టు రాజేందర్ గౌడ్, ప్రభాకర్ గౌడ్,లక్ష్మణ్ తోర్రూరు మున్సిపాలిటీ నుండి బిఆర్ఎస్ యూత్ నాయకులు తూర్పటి మెండీస్, తూర్పటి సాయి ముకేష్,కల్యాణి సారయ్య, జలపతి, చందు,సతీష్ దేవ్,విశాల్,రాజ్ కుమార్,అశోక్. పర్వతగిరి మండలం మాల్య తండ బి ఆర్ ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు గుగులోత్ సుమన్,ఏనుగల్ గ్రామం నుండి యువక నాయకులు రాజుగ్రేటర్ వరంగల్ 2 వ డివిజన్ గుండ్ల సింగారం కి చెందిన దుంపల మహేందర్,రాము, పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు
previous post