పెద్దాయనకు పాదాభివందనం చేసిన అమిలినేని సురేంద్రబాబు
జై భారత వాయిస్,,,కుందుర్పి
అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అన్నా….ఆ పార్టీ జండా అన్నా చాలామందిలో ఊహించని విధానా పూనకాలువస్తాయి ఈ సందర్భంలో ఆదివారం కుందుర్పి మండలం ఎర్రగుంట గ్రామానికి ఎన్నికల ప్రచారం వెళ్లిన ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు కుశ్రీరంగప్ప అనే 7 పదులు వయసు దాటిన ఓ పెద్దాయన కనిపించాడు. అతన్ని దగ్గరికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్న సందర్భంలో ఆ పెద్దాయన ఎగిరి గంతేశాడు. అన్న నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ ముందు ముందుకు కొనసాగాలని ఆకాంక్షించారు
సందర్భంలో పెద్దాయనకు పాదాభివందనం చేసుకున్న సురేంద్ర బాబును చూసి అక్కడున్న పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలoదరూ ఆశ్చర్యపోయారు. పెద్దలంటే గౌరవం వినయం విధేయతా ఉన్న సురేంద్రబాబుకు మంచి భవిష్యత్తు ఉందని కొనియాడారు