Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 14 పార్లమెంట్ సీట్లు మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు

జై భారత్ వాయిస్ వరంగల్  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 14 పార్లమెంట్ సీట్లు వస్తాయని వరంగల్ మాజీ మేయర్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గుండా ప్రకాష్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్ చౌరస్తాలో ఆర్యవైశ్య భవన్ లో మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేయడం సరైనది కాదని, సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ప్రభుత్వం ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు స్పష్టం చేయాలని అన్నారు., దేశాన్ని అభివృద్ధి చేయకపోవడం మీ కాక మళ్లీ రాముని పేరు చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఇక తెలంగాణ రాష్ట్రంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడంతో 90 వేల కోట్ల రూపాయలు నీటిపాలయ్యాయని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకుంటుందని వరంగల్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న కడియం కావ్య రెండు లక్షల మెజారిటీతో గెలుపొందే అవకాశం ఉందని ప్రకాష్ రావు అన్నారు

 

Related posts

మత్స్యకారుల కుటుంబాల్లో సిరులు కురవడమే రాష్ట్ర ప్రభుత్వ  లక్ష్యం:

రజిని కి జిల్లా ఉత్తమ ఉపాద్యాయ అవార్డు

Jaibharath News

టీజీఓ వరంగల్ జిల్లా జాయింట్ సెక్రటరీగా మధుసూదన్ రెడ్డి