Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆర్ట్స్ కళాశాల 2023 -24 వార్షిక నివేదిక విడుదల!

జై భారత్ వాయిస్ హన్మకొండ

హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 2023- 24 విద్యా సంవత్సరానికి గాను పత్రికలు, మీడియా రంగాలలో వచ్చిన వార్తలను, కథనాల తో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పౌర సంబంధాల విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన వార్షిక నివేదికను సోమవారం కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రమేష్ మాట్లాడుతూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో గత 20 సంవత్సరాలుగా నిరంతరంగా ప్రతి విద్యా సంవత్సరం వార్షిక నివేదిక విడుదల చేయడం జరుగుతుందని, ఈ డాక్యుమెంటేషన్ భవిష్యత్తుకు దోహదపడుతుందని, ముఖ్యంగా నేషనల్ అసెస్మెంట్ అక్రిడేషన్ కళాశాల సందర్శించినప్పుడు ఇటువంటి వార్షిక నివేదికలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్. సుంకరి జ్యోతి మాట్లాడుతూ కళాశాల పబ్లిక్ రిలేషన్( పి ఆర్ ఓ) విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన ప్రెస్ , మీడియా రంగాలలో వచ్చిన కళాశాల వార్తల సంపుటి విద్యార్థులకు అధ్యాపకులకు కళాశాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి మాట్లాడుతూ వర్తమాన సమాజానికి డాక్యుమెంటేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని, నేటి ఆధునిక యుగంలో డిజిటలైజేషన్ విధానం అమలులోనికి వచ్చినప్పటికీ డాక్యుమెంటేషన్ చరిత్ర రచనకు ఉపయోగపడుతుందన్నారు. ఈ డాక్యుమెంటేషన్ లో కళాశాలలో జరిగే బోధన, పరిశోధన, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్సిసి ,ఎన్ఎస్ఎస్ ఇతర ఇతర సేవా కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పత్రికలలో మీడియా రంగాలలో వచ్చిన కథనాలను ఒక నివేదిక తయారు చేసి ప్రతి సంవత్సరం విడుదల చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.
కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ పుల్ల రమేష్, సహాయక రిజిస్టర్ సరళ దేవి, నరసయ్య, డాక్టర్. అంజన్ రావు, డాక్టర్ శ్రీధర్ కుమార్, డాక్టర్ శ్రీలత, డాక్టర్ మాధవి, డాక్టర్ మంద శ్రీనివాస్, డాక్టర్ గిరి ప్రసాద్, డాక్టర్ హరి కుమార్, డాక్టర్ ఫరహా ఫాతిమా, డాక్టర్ నహీదా, డాక్టర్ శేషు, రెహమాన్, డాక్టర్ నాగయ్య, డాక్టర్ కనకయ్య డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ భాస్కర్, డాక్టర్ సుచరిత, డాక్టర్ రాంబాబు, డాక్టర్ జోష్ణ, డాక్టర్ సతీష్, డాక్టర్ కరుణాకర్, డాక్టర్ రమేష్ రెడ్డి, విద్యార్థులు బోధన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో బిజెపి నేతలు

Jaibharath News

ఆర్ట్స్ కళాశాల సెమిస్టర్ ఫలితాలు విడుదల!

Kaloji కాకతీయుల కళల కాణాచికి మరో మణిహారం.కాళోజీ కళాక్షేత్రం ప్రారంభనికి శుభమూహూర్తం