(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆత్మకూరు మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మంగళవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు బండారి స్వాగత్ రన్వీర్ చంద్ తొలుత కటాక్షపూర్ చెక్ పోస్ట్ ను సందర్శించారు అనంతరం నీరుకుల్ల, అక్కంపేట గ్రామాల లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పరకాల అర్ డి ఓ పరకాల ఏసీపీ కిషోర్ కుమార్, ఆత్మకూర్ సిఐ క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


