Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

తలారి రంగయ్య మద్దతుగా సోదరుడుకృషి ఎన్నికల ప్రచారం

తలారి రంగయ్యకు మద్దతుగా సోదరుడు కృష్ణ ఎన్నికల ప్రచారం

-ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న వైసీపీ

జై,భారత వాయిస్ కళ్యాణదుర్గం,

కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తలారి రంగయ్య ను అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా మాలగుండ్ల శంకర్ నారాయణ ను గెలిపించాలంటూ సోదరుడు తలారి కృష్ణ బుధవారం మండలంలోని కొత్తపల్లి, ఓంటా రెడ్డిపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి గడపకు తిరుగుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో ప్రవేశ పెట్టిన నవరత్నాలు, పలు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయాల గ్రామ పరిపాలన కొనసాగాలంటే , ఇంటి వద్దకు పెన్షన్ , డోర్ డెలివరీ క్రింద రేషన్ పంపిణీ వ్యవస్థ రావాలంటే మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మండల సచివాలయాల కన్వీనర్ గంగాధర, ఆర్ఎంపీ డాక్టర్ బొమ్మయ్య , కంబదూరు సచివాలయం -2 కన్వీనర్ కొత్తపల్లి నాగన్న, లింగమూర్తి. మాజీ వార్డ్ మెంబర్ ముత్యాలమ్మ, బసవరాజు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు అభిమానులు పాల్గొన్నార

Related posts

ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు సహకరించండి.అమిలినేని

576 కర్ణాటక మద్యం పట్టివేత

Jaibharath News

హనుమాన్ సందర్భంగా జయంతి వేడుకలు,

Jaibharath News