Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాంభూపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాంభూపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు,,,

జై భారత వాయిస్,, కుందుర్పి

కుందుర్పి మండలం లోని రుద్రంపల్లి,గురివేపల్లి,బోదిపల్లి ,ఎనుములదొడ్డి, తెనగల్లు,కరిగానపల్లి తూమకుంట గ్రామాలలో కళ్యాణదుర్గం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాంభూపాల్ రెడ్డి గురువారం పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రత్యేక హోదా సాధించాలన్నా,ప్రతి రైతుకు 2లక్షల రూపాయల రుణం మాఫీ చేయాలన్నా,బియ్యం కార్డు కల్గిన ప్రతి మహిళ ఖాతాకు ఏడాదికి లక్ష రూపాయల మొత్తం జమ కావాలన్నా,కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని 114 చెరువులకు సాగు నీరు కావాలన్నా,ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి సమకూర్చాలన్నా పేదల పక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం గుర్తుకు ఈ నెల 13న జరిగి సార్వత్రిక ఎన్నికలలో ఓటు వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని ఆయన ఆయా గ్రామాలకు చెందిన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు..జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కరీం,రిటైర్డ్ ఎమ్మార్వో తిమ్మప్ప, కంబదూరు మండల కన్వినర్ కొత్తపల్లి ఈరన్న,చెన్నంపల్లి మధు,మెకానిక్ దామోదర్, ఓబగానపల్లి యాటకల్లు ఈరన్న,ఓబగానపల్లి ముత్యాలప్ప లతో పాటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులు ,స్థానిక నాయకులు తదితరులు పాల్గొని ప్రచారాన్ని నిర్వహించారు

Related posts

కర్ణాటక మాద్యం 384 ప్యాకెట్లు పట్టివేత

Jaibharath News

ఎన్టీఆర్ రామారావు గారి జన్మదిన వేడుకలు

Jaibharath News

ముస్లిం సోదరుల మైనార్టీ ఆత్మ యొక్క కలయిక

Jaibharath News