Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మట్టిలో నవజాత శిశువు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు

జై భారత్ వాయిస్ దామెర
మారుతున్న కాలానికి అనుగుణంగా సమాజంలో మానవత్వ విలువలు మంట కలుస్తుంది.అప్పుడే పుట్టిన శిశువు తల్లి పొత్తిళ్ళలో ఉండవలసిన శిశువు కన్న పేగు బంధానికి ఆ మాతృమూర్తికి దూరమైందా లేక ఆ మాతృమూర్తి తల్లిదండ్రులు దూరం చేశారా శిశువును దూరం చేయడం కోసం వేసిన పన్నాగాన్ని ఆ దైవమే భూమాత రక్షించింది.వివరాల్లోకి వెళ్ళితేహన్మకొండ జిల్లా దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో ఊరుగొండ వద్ద 163 వ నంబరు జాతీయ రహదారిపై గుర్తు తెలియని ఆడ శిశువు ను మట్టిలో పూడ్చి పెట్టారని శనివారం నాడు సమాచారం రావడంతో హుటాహుటిన దామెర ఎస్సై అశోక్ చేరుకున్నారు. అప్పటికే అక్కడే ఉన్న లారీ డ్రైవర్ శిశువు ను మట్టిలో నుంచి వెలికి తీసి ఒక గుడ్డ లో పడుకోబెట్టారు.అప్పటీకే ఓసారి డ్రైవర్ కూలిలు శిశువును రక్షించే ప్రయత్నం చేశారు.వెంటనే ఎస్సై అశోక్ వారి వద్ద ఉన్న నూతన క్లాత్ తో తుడిచారు.వెంటనే హోంగార్డ్ డ్రైవర్ కుమారస్వామి క్లాత్ తో తుడిచి దుమ్ము, ధూళి ను తుడిచారు. 108 కు సమాచారం అందించినా వాహనం రావడం ఆలస్యం కావడంతో ఎస్సై అశోక్ తన వాహనంలో దగ్గర్లో ఉన్న అపోలో NSR హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళారు. వెంటనే స్పందించిన ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఆ శిశువు కు ప్రథమ చికిత్స అందించారు. 108 నవ జాత తరలింపు వాహనం రావడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. శిశువు ఆరోగ్యం నిలకడ గా ఉంది.వరంగల్ Mgm ఆసుపత్రిలో శిశువు ను పరకాల రూరల్ సీఐ రంజిత్ రావు, ఎస్సై శ్రీ అశోక్ గ చూసి, వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆదశిశువు ను అక్కడ ఎవరు పదవేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీ అశోక్ తెలిపారు.ఘటన జరిగిన  వెంటనే స్పందించిన దామెర ఎస్సై శ్రీ అశోక్, హోం గార్డ్ డ్రైవర్ కుమారస్వామి లను సీఐ రంజిత్ రావు అభినందించారు.

 

Related posts

ఆత్మకూరు లో వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

Jaibharath News

రోడ్ల పై ధాన్యం ఆరబొస్తే కఠిన చర్యలు … సి ఐ రవిరాజు

Jaibharath News

పెంచికలపెట లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Jaibharath News