జై భారత్ వాయిస్
ఆత్మకూరు ): పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వృద్ధులు వికలాంగులు ఓటు వేయలేని పరిస్థితిలో ఉన్న వారికి ఎన్నికల కమిషన్ ముందస్తుగా ఇంటి వద్ద ఓటు వేసేందుకు వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో శనివారం మండలంలోని కామారం గ్రామంలో హోమ్ పోలింగ్ నిర్వహించారు హోమ్ పోలింగ్ ని పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ పరిశీలించారు. అలాగే మండలంలోని కటక్షపూర్ వద్ద నిర్వహిస్తున్న బార్డర్ చెక్ పోస్ట్ ని ఎసిపి సందర్శించి చెక్ పోస్ట్ సిబ్బందికి తగిన సూచనలుసలహాలు అంద చేశారు. విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏసిపి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏసిపి వెంట సీఐ క్రాంతి కుమార్ ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
previous post