Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

ఏ ఆర్ తో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉమా మహేశ్వర

ఏ అర్హతతో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నావ్;ఉమామహేశ్వర నాయుడు

జై భారత వాయిస్, కళ్యాణదుర్గం,,

కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి నీకు ఉన్న అర్హత ఏంటి అని కళ్యాణదుర్గం వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు ప్రశ్నించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం రూరల్ మండల పరిధిలోని మల్లిపల్లి, లక్ష్మీపురం, పాలవాయి,మల్లాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ కళ్యాణదుర్గంలో ఓటర్ కానటువంటి నీకు శాసనసభ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఉన్న అర్హత ఏంటి అని కళ్యాణదుర్గం రైతుల పాలిట శాపంగా మారిన నువ్వు 114 చెరువులకు కాలువలు తవ్వుకుండా బిల్లులు చేసుకుని 2024 డిసెంబర్లో నీ కాంట్రాక్ట్ కాలం చెల్లిపోతుందని ఇప్పుడు వచ్చి కాలువలు తవ్వుతానని కల్లబొల్లి మాటలు చెబుతున్నావని ఎద్దేవా చేశారు. అదేవిధంగా సమాజానికి దూరంగా ఊరి బయట డేరా వేసుకొని అసాంఘిక కార్యక్రమాలు ప్రోత్సహించే విధంగా డేరా బాబా అవతారం ఎత్తారని ఇటువంటి వారిని సమయస్ఫూర్తితో ఓడించి ఇంటికి పంపవలసిందిగా తెలియజేశారు.కావున సంక్షేమ అభివృద్ధి కోసం పాటుపడే అవినీతి మరకలు లేని మేమిద్దరం బాధ్యతగా కళ్యాణదుర్గం ప్రజల కోసం విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, నాడు-నేడు, పేదలందరికీ ఇల్లు,మహిళా సాధికారత,సామాజిక భద్రత వంటి అంశాలలో ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా ప్రజలకు పరిపాలన అందించడమే మా లక్ష్యం అని తెలియజేశారు. అలాగే మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్యకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డిని తిరిగి మరలా ముఖ్యమంత్రి చేసుకుందామని తెలియజేశారు…

Related posts

భారీ మెజారిటీతో గెలిపోందిన సురేంద్రబాబును మహిళలు ప్రత్యేక పూజలు

Jaibharath News

కుందుర్పి నూతన ఎంపీడీఓగ బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్

Jaibharath News

అనారోగ్యంతో ప్రభుత్వ ఉద్యోగి మృతి

Jaibharath News