అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గీసకొండ మండలం వంచనగిరిలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలలో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ ఓటుహక్కు ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన శక్తివంతమైన ఆయుధమని మంత్రి సురేఖ అన్నారు. ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకుని బాధ్యత కలిగిన పౌరులుగా నిలవాలన్నారు. లౌకిక స్ఫూర్తిని ప్రదర్శిస్తూ, ప్రజల స్వేచ్ఛని కాపాడుతూ, రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల సాధనకై ప్రజలు తమ అమూల్యమైన ఓటును పూర్తి విచక్షణతో వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
