Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
చిన్ననాటి బాల్యమిత్రుడు నాగపురి మహేష్ అకాల మరణం చెందడంతో ఆ కుటుంబానికి తోటి మిత్ర బృందం ఆర్థిక సహాయాన్ని అందించి వారి ఔదార్యాన్ని చాటుకున్నారు. వివరాల లోకి వెళితే ఆత్మకూరు లో పదవ తరగతి 1990-1991 బ్యాచ్ బాల్యమిత్రుడు నాగపురి మహేష్ యాక్సిడెంట్లో మృతి చెందారు. మృతుని కుటుంబాన్ని బాల్యమిత్రులు మునుకుంట్ల సతీష్, పరికరాల వాసు, పాపని రవీందర్, బయ్య శ్రీధర్, మూల ప్రవీణ్, లక్కర్స్ ఈశ్వర్, పలకల రాజమల్లారెడ్డి, కాసర్ల రాజు, రాస మల్ల పరమేశ్వర్, ఊకంటి వెంకట్ రెడ్డి, కొత్తగట్టుఅశోక్ , పాయిరాల సుగ్రీవుడు,తాళ్లపల్లి పరమేశ్వర్ పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. మీ కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటామని మీకు ఏ అవసరం వచ్చినా మేమందరం వస్తామని భరోసా ఇచ్చారు.

Related posts

బాధితుడికి మొబైల్ ఫోన్ ను అప్పగించిన పోలీసులు

గంజాయి రవాణా చేస్తున్న ఆటో డ్రైవర్ అరెస్ట్

పేద రెడ్ల అభ్యున్నతికి కృషి’

Jaibharath News