Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఆర్యవైశ్య విద్యార్థిని విద్యార్థులకు సన్మానం

జై భారత్ వాయిస్ వరంగల్
గ్రేటర్ వరంగల్ నగరంలోనిశ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో 2024 సంవత్సరంలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులైన పదవ తరగతి ఇంటర్మీడియట్ లో వరంగల్, హన్మకొండ, కాజిపేట్ లోని ఆర్యవైశ్య విద్యార్థిని విద్యార్థులను వరంగల్ ఎంజీ రోడ్, ఆర్యవైశ్య వాసవి మాత పరపతి సంఘం, ఆధ్వర్యంలో పదవ తరగతి ఇంటర్మీడియట్ ఉత్తమ ఫలితాలు సాధించిని విధ్యార్థులను పరపతి సంఘం నిర్వహులు
ప్యూర్ వెండి మెడల్,మేమెంటో, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగాపరపతి సంఘం అధ్యక్షులు ఇరుకుల్ల రమేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు ఎంత ప్రతిభ ఉన్నా గానీ రిజర్వేషన్ల అడ్డు కారణంగా ఉన్నత ఉద్యోగాలలో వెనుకబడి ఉన్నారని అన్నారు పిల్లల భవిష్యత్తు ఇప్పటినుండే వారి జీవితానికి పునాది రాయి లాంటిది.పిల్లలు అందరూ మంచి విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాల్లో ఉండి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను, సమాజాన్ని గౌరవించాలని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.పిల్లల ను ప్రోత్సహించుట కొరకు ఈ యొక్క సన్మాన కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. పిల్లల భవిష్యత్తు నిమిత్తము ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ఉపాధ్యాయులను,రిటైర్ ఉపాధ్యాయులను సన్మానించడం జరిగినది సుమారు 50 మంది పిల్లలకు సన్మానము చేసి వారికి దేవస్థాన అర్చకులు రామాచారి, కృష్ణమాచారీ చే వేద ఆశీర్వచనము అందచేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అకినేపల్లి సత్యనారాయణ, బెజుగం రజినీకాంత్, వెలగందుల రమేష్ గారు, కుంచం వీరభద్ర రావు మాజీ మున్సిపల్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ తోట నవీన్ సంఘం కార్యవర్గ సభ్యులు, సాదారణ సభ్యులు, పురప్రముఖులు, విద్యావేత్తలు పాల్గొన్నారు.

Related posts

డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్

Sambasivarao

ఆర్ఎంపి పి.ఎం.పి సంఘాల నిరసన ర్యాలీ

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో పాల్గొన్నా పరకాల కాంటెస్ట్ ఎమ్మెల్యే డా,, ఖాళీ ప్రసాద్