Jaibharathvoice.com | Telugu News App In Telangana
కాకినాడ

కాకినాడ రహదారుల్లో ప్యాచ్’వర్కులు చేపట్టాలిపౌర సంక్షేమ సంఘం

జై భారత్ వాయిస్ కాకినాడ
కాకినాడ నగరంలో పలు ప్రధాన రహదారులు శిథిలావస్థకు చేరాయని ప్యాచ్ వర్కులు చేపట్టకుంటే మరింత పాడయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు కోరారు.ఎన్ టి ఆర్ బ్రిడ్జిపై ఏర్పడినగొయ్యిని డెబ్రిస్ వేసి పూడ్చారు. ఇటువంటి గోతులు కరప రోడ్ వరకు అన్నమ్మ ఘాటీ మెయిన్ రోడ్ వార్ఫ్ రోడ్ జన్మ భూమి రోడ్ ప్రాంతాల్లో వున్నాయన్నారు. టుటౌన్ సాంబమూర్తి నగర్ జగన్నాధపురం ఫ్లైఓవర్ బ్రిడ్జిల రోడ్లు శిథిల మైపాడైనందున తారురోడ్ల పునః నిర్మాణం చేయించాలన్నారు.  రానున్న వర్షాలలో పాడయ్యే రోడ్లను గుర్తించి ముందుగా ప్యాచ్ వర్కులు చేయించే బాధ్యతను ఆర్ అండ్ బి మున్సిపాలిటీ చేపట్టాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు కోరారు.

Related posts

అఖండశక్తిపాతం ‘గోవిందనామం’*

Jaibharath News

పోస్టుకార్డుల ఉద్యమం

కాకినాడలో విలీనం కోరుతూ పోస్టుకార్డు ఉద్యమం చేపట్టిన రమణయ్యపేట వాసులు