Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఆమ్మ ఆదర్శ పాఠశాలల పనులు జూన్ 5 కల్లా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య

జై భారత్ వాయిస్   వరంగల్/ గీసుకొండ
వరంగల్ జిల్లాలోని అన్ని అమ్మ ఆదర్శ పాఠశాలలలో అభివృద్ధి పనులు జూన్ 5 కల్లా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశించారు. గురువారం వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని పలు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో  పరిశీలించారు.
ఈ సందర్భంగా గీసుకొండ మండలంలోని జాన్ పాక ఎంపీపీఎస్ ఉర్దూ మీడియం పాఠశాల,  గుంటూరు పల్లి లోని ఎంపీపీఎస్ కొమ్మాల అంగడి పాఠశాల,  ఎంపీపీఎస్ బి ఎస్ పల్లి పాఠశాలలలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గుర్తించబడిన ప్రభుత్వ పాఠశాలల్లో  ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ద్వారా టాయిలెట్లు, తాగునీటి సౌకర్యం,విద్యుత్, సుందరీకరణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.అనంతరం కొనాయిమాకుల,  గీసుకొండ మండల కేంద్రంలో మండల సమాఖ్య లచే నిర్వహించబడుతున్న ఏకరూప దుస్తుల తయారీను  పరిశీలించి వచ్చే జూన్ 10లోగా విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తుల కుట్టడం పూర్తి కావాలని ఆదేశించారు.కలెక్టర్ వెంట విద్యాశాఖ అధికారి వాసంతి, డిఆర్డిఏ ఏపీఎం రేణుకా దేవి, డిపిఎం భవాని, తహశీల్దార్ రియాజ్,  మండల స్పెషల్ అధికారి తదితరులు ఉన్నారు.

Related posts

మహారాష్ట్ర విజయం మోడీ ఛరిష్మాకు నిదర్శనం

గిరిజన తండాలో వైద్య శిబిరం

Sambasivarao

భారీ వర్షాల పట్ల పరకాల నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి