జై భారత్ వాయిస్ దామెర
రహదారులపై మొక్కజొన్నలు ఆరబోయవద్దని దామెర ఎస్సై కొంక అశోక్ రైతులకు సూచించారు.దామెర నుంచి ల్యాదళ్ల వెళ్లే రహదారిపై ధాన్యం పోసిన ప్రదేశాన్ని సందర్శించి, రైతులతో మాట్లాడారు. రహదారిపై మొక్కజొన్నలు, ధాన్యంను అరబోయడం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. రహదారులపైనుంచి తొలగించి, ఖాళీ ప్రదేశాల్లో ధాన్యంను అరబోసుకోవాలని సూచించారు. లేనిచో కేసులు నమోదు చేస్తామని అన్నారు. వీరి వెంట సిబ్బంది ఉన్నారు.
previous post