April 10, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఉద్యోగాలుకృష్ణా

వైద్య కళాశాలల్లో  29మంది   అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం


జై భారత్ వాయిస్ విజయవాడ  వైద్య విద్యా డైరెక్టరేట్(DME) ఆధ్వర్యంలో  వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 29 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి ఎం. శ్రీనివాసరావు  ప్రకటనలో తెలిపారు.  శాశ్వత ప్రాతిపదికన (Regular Basis) డైరెక్ట్ మరియు లేటరల్ ఎంట్రీ ద్వారా ఈ  పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఫేజ్ -2 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో బ్రాడ్ స్పెషాలిటీలలో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తామని పేర్కొన్నారు.ఈ పోస్టులకు సంబంధించిన అర్హతా ప్రమాణాలు, సవివరమైన మార్గదర్శకాలు  https://dme.ap.nic.in మరియు http://apmsrb.ap.gov.in/msrb/
వెబ్ సైట్ లలో అందుబాటులో ఉన్నాయని వివరించారు.  ఆసక్తికలిగిన అభ్యర్ధులు తమ దరఖాస్తుల్ని ఆన్ లైన్లో  ఈ నెల 18వ తేదీ నుండి 27వ తేదీ లోగా సమర్పించాలని ఆయన సూచించారు.

Related posts

ఏపీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన ఖరారు.‌

Jaibharath News

డిఎస్సీ పోటీ పరీక్షకు ఉచిత శిక్షణ

Jaibharath News

నూకాలమ్మ అమ్మవారి సేవలో మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్