Jaibharathvoice.com | Telugu News App In Telangana
భక్తి సమాచారంవరంగల్ జిల్లా

గీసుకొండ లో వైభవంగా బ్రహ్మం గారి ఆరాధన మహోత్సవం

జై భారత్ వాయిస్ గీసుకొండ

గీసుకొండ మండల కేంద్రంలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో బ్రహ్మం గారి 331వ ఆరాధన మహోత్సవం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బాలోజు రమేష్ ఆచార్యులు, బెజ్జెంకి బిక్షపతి దైవజ్ఞ ఆచార్యులు ఆధ్వర్యంలో స్వామి వారికి అభిషేకం, పూజా కార్యక్రమం, హోమం నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు మహా అన్న ప్రసాద వితరణ చేశారు. ఈకార్యక్రమంలో స్థానిక విశ్వకర్మలు తాటికొండ మల్లేశం, గురుమూర్తి, వెంకటేశ్వర్లు, వీరాచారి, కృష్ణమూర్తి, నరేందర్,సుధాకర్, కర్ణకంటి సత్యనారాయణ, చంద్రాచారి, రాంమూర్తి, గణేష్,కోటి, వంశీ, వంగల రాంబాబు, చిట్టిమళ్ల వెంకన్న మరియు హనుమాన్ దీక్షాధారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మంత్రి కొండా సురేఖ వంచనగిరిలో తన ఓటు

తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం

Sambasivarao

Nashamukthbharathabhiyan.యువత మత్తుకు బానిస కావద్దు వరంగల్ ఎంపీ కడియం కావ్య.