జై భారత్ వాయిస్ సంగెం
ఎలుగూర్ రంగంపేట చెరువులో వింత చేప లభ్యమైంది. రోజుమాదిరిగానే మత్స్యకారులు సోమవారం చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో మత్స్యకారుడు బోనాల మహేందర్ విసిరిన వలకు ఈ వింత చేప చిక్కింది. దీంతో ఒడ్డుకు తీసుకురాగా తోటి మత్స్యకారులతోపాటు.. గ్రామస్తులు వింత చేపను ఆసక్తి గా తిలకించారు . కాగా .ఇదీ సముద్ర చేపల ఉందని స్థానికులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ మధ్యకాలంలో రిజర్వాయర్లకు.. అక్కడ నుంచి చెరువుల్లోకి వచ్చే నీటి తో ఇలాంటి వింత చేపలు వస్తున్నట్టు మత్స్యకారులు తెలిపారు. కాగా.. ఎక్కువ మంది ఇదీ వింతగా.. చూసేందుకు భయానకంగా ఉండటం తో దీనిని దయ్యం చెప్పగా చెపుతున్నారు. అయితే చూడటానికి భయంకరంగా ఉండటం తో దానిని తినేందుకు ఎవరు ఆసక్తి చూపకపో వడం గమనార్హం.