Jaibharathvoice.com | Telugu News App In Telangana
భక్తి సమాచారం

ఘనంగా ముగిసినశ్రీ భద్రకాళి భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు

శ్రీ భద్రకాళి దేవస్థానంలో గత 11 రోజులుగా ఎంతో వైభవంగా నిర్వహింపబడుతున్న శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు సోమవారం చక్ర తీర్థోత్సవం, చక్రస్నానం, ధ్వజ అవరోహణం ఘటాభిషేకం, పుష్పయాగంతో సుసంపన్నమయ్యాయి. అమ్మవారికి ఉదయం నాలుగు గంటలకు నిత్యానికం పూర్తి చేసిన తర్వాత స్నపన విధి విశేష పూజారికాములు నిర్వహించి అమ్మవారికి చూర్ణోత్సవం జరిపారు. ఈరోజు సువాసినిమనులు ముత్తైదువలు అందరూ కలిసి జరిపిన చిరునోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అమ్మవారి అభిషేకానికి పసుపుకొమ్ములు, సుగంధ ద్రవ్యాలు అన్నీ ఒకేచోట చేర్చి తిరగలిలో వేసి ముత్తయిదువలు విసిరి అమ్మవారికి ఒక పాత్రలో సమర్పించారు. ఈ చూర్ణాన్ని చక్రతీర్థోత్సవం  అమ్మవారికి నలుగు పిండిగా ఉపయోగించి స్నపనం జరుపుతారు. చక్రతీర్థోత్సవం చక్రస్నానం ప్రధాన అర్చకులు  భద్రకాళి శేషు నేతృత్వంలో ఆలయ పార్శ్వరంలోని భద్రకాళి తటాకంలో నిర్వహించిన చక్రస్నానం దర్శించడానికి రెండు కళ్ళు సరిపోనంత వైభవంగా నిర్వహించారు. దర్శించిన భక్తులు ఒక దివ్యానుభూతిలోనై ఆనంద పరవశులయ్యారు. అనంతరం భేరీతాడనం జరిపి ద్వజావరోహణం చేశారు. బ్రహ్మోత్సవ నిర్వహణలో అధికారుల, అర్చకుల, భక్తుల లేదా తదితలే తదితరులు ఎవ్వరి వల్లనైనా జ్ఞాతజ్ఞాతంగా జరిగిన పొరపాట్లు లేదా న్యూనతరిక్త దోషాల వల్ల సంక్రమించే పాపం తొలగిపోయి బ్రహ్మోత్సవ సంపూర్ణ సాంగత్వం కలిగి భక్తులందరికీ శుభాలు ప్రాప్తింప చేయడానికి శాస్త్రంలో చెప్పబడిన ప్రకారం అమ్మవారికి శత ఘటాభిషేకం జరిపి రాత్రి పుష్పయాగం నిర్వహించారు. పుష్పయాగంలో అనేకమంది భక్తులు పాల్గొన్నారు. శాస్త్రంలో చెప్పబడిన మేరకు పుష్పయాగంలో అమ్మవారికి అర్చకులు పదిసార్లు జరిపిన దశార్చన ఆరాధన భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని ప్రసాదించింది.

Related posts

సంకటహర గణపతి స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం,

పంచకూట శివాలయ పునః ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవం-ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు వంగాల బుచ్చిరెడ్డి.

అనగాష్టమి వ్రతం ఆచరణతో అష్ట లక్ష్మిల అనుగ్రహం.