జై భారద్ వాయిస్ హన్మకొండ
వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నాడు బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ రెడ్డి బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి కి మద్దతుగా హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ లో మార్నింగ్ వాక్ లో పట్టభద్రులను, నగర వాసులను కలుసుకొని రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో క్రమ సంఖ్య 1 పై మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి, ప్రజల పక్షనా కొట్లాడే గొంతుకు అండగా నిలబడాలని అభ్యర్ధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి నాయకులు అమర్నాథ్ రెడ్డి, లక్ష్మి రత్న, రవీందర్ రెడ్డి, గై సారంగపాణి, దొంతుల వాసుదేవ రెడ్డి, ప్రసాద్, వెంకన్న, నవీన్, అల్లం మల్లికార్జున్, రమేష్, వెంకటేష్ గౌడ్, సందీప్, మొగిలి, శ్రీనివాస్, రవీందర్, అమరేందర్ దూడం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
