Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

జీవవైవిధ్య పరిరక్షణ అందరి బాధ్యత అని బల్దియా కమీషనర్ అశ్విని తానాజీ వాకడే అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారంనాడుహన్మకొండ పబ్లిక్ గార్డెన్ లోని నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో తెలంగాణ జీవ వైవిద్య మండలి, పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, జనవిజ్ఞాన వేదిక, వన సేవా సొసైటీ ఇతర హరిత స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీవవైవిధ్య పరిరక్షణ అవగాహన సదస్సు కు కమీషనర్ ముఖ్య అతిథి గా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ జీవవైవిద్యమే మానవ మనుగడకు ఆధారం ఈ వైవిధ్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజం లోని ప్రతి ఒక్కరి పై ఉందని, భూగ్రహంపైన ఉన్న అద్భుత జీవవైవిద్యాన్ని ప్రస్తుత తరం సంరక్షించి రాబోయే మన వారసత్వానికి అందించాల్సిన గురుతర బాధ్యత మనందరి పైన ఉందన్నారు.ఇట్టి కార్యక్రమాన్ని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణ లో భాగం గా మొక్కలను నాటారు. ఇంద్రజాలికుడు జయకర్ ఆధ్వర్యం లో స్నేక్ అవేర్నెస్ షో నిర్వహించడం జరిగింది అనంతరం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కల ప్రదర్శన- విక్రయం, ప్రకృతి మిత్ర, సేంద్రియ సాగు, పండ్లు సిరి ధాన్యాల ఉత్పత్తుల ప్రదర్శన విక్రయమేళా, ఈ వెహికల్స్ స్టాల్ లను కమీషనర్ ప్రారంభించారు.ఇట్టి అవగాహన కార్యక్రమం లో బల్దియా అదనపు కమిషనర్ అనీసూర్ రషీద్ హార్టికల్చర్ అధికారి రమేష్ ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ, జలసాధన సమితి వ్యవస్థాపకులు దుశర్ల సత్యనారాయణ విజిలెన్స్ డిఎఫ్ఓ నాగభూషణం ఏఎస్పీ సైబర్ క్రైమ్ విజయకుమార్, డిఆర్ఓ వైవి గణేష్ , కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్ సుభాష్ కాలమిస్ట్ పుల్లూరి సుధాకర్ జీవ వైవిధ్య మండలి జిల్లా కో ఆర్డినేటర్ లక్ష్మి పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్. జెవివి ప్రధాన కార్యదర్శి పరికిపండ్ల వేణు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎన్ఎస్ఎస్ అవతరణ దినోత్సవం – షీ టీం అవగాహన సదస్సు*

Sambasivarao

చిన్న సన్న కారు రైతులకే భరోసా పథకాన్ని వర్తింప చేయాలి

Ashok

పేద వారి కోసం గృహ లక్ష్మి పథకం – ఎమ్మేల్యే ధర్మా రెడ్డి

Jaibharath News