జై భారత్ వాయిస్ వరంగల్
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హసన్ పర్తి, వేలేరు, వంగర, బండారుపల్లి, కొడకండ్ల, నెక్కొండ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, పాఠశాలల్లో ఖాళీగా ఉన్న వివిధ సబ్జెక్టులు బోధించేందుకు గెస్ట్ టీచర్స్, గెస్ట్ లెక్చరర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు
హనన్ పర్తి రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె. ఇందుమతి తెలిపారు. ఎంపికైన అభ్యర్థులుఐదోతరగతి నుంచి ఇంటర్ మీడియట్ వరకు ఆంగ్ల మాద్యమంలో బోధించాల్సి ఉంటుందన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. బోధన అనుభవం, మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులు జూన్ 1వ తేదిన హసన్ పర్తి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజి, పాఠశాలలో జరిగే ఇంటర్వ్యూ, డెమోకు హాజరుకావాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాల కోసం 9866559727 సంప్రదించాలని కె. ఇందుమతి సూచించారు.