Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

వరంగల్ లో ప్రశాంతంగా పాలీసెట్ – 2024 పరీక్ష

జై భారత్ వాయిస్ వరంగల్
రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిర్వహించిన పాలీసెట్-2024 పరీక్ష వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. వరంగల్ నుండి 3100 అబ్బాయిలకుగాను 2829 మంది హాజరైనారు. అలాగే 2524 అమ్మాయిలకు గాను 2292 మంది హాజరైనారని వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రధానాచార్యులు జిల్లా కో-ఆర్డినేటర్ డా. బైరి ప్రభాకర్ తెలిపారు. మొత్తంగా 5624 మందికి 5121 మంది హాజరై 91.05% హాజరు శాతం నమోదు చేశారు. వరంగల్, హనుమకొండ నగరాలలోని 12 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ పరీక్షకు SBTET నుండి Special Observer గా టి. కృష్ణవేణి పరీక్ష కేంద్రాలను పర్యావేక్షించారు.

Related posts

గీసుకొండలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతం:చీఫ్  సూపరింటెండెంట్ కృష్ణమోహన్ 

చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నివాళులర్పించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్

Sambasivarao

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన అల్లం బాలకిషన్ రెడ్డి

Sambasivarao