Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

బిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపు తథ్యం

బై భారత్ వాయిస్ గీసుకొండ
బిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని పట్టబద్రులుగా మనమంతా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని గీసుగొండ మండల BRS యూత్ అధ్యక్షులు శిరిసే శ్రీకాంత్ కోరారు.బిట్స్ పిలానీ లో విదభ్యాసం పూర్తి చేసి అమెరికాలో ఉన్నత ఉద్యోగం ఉంది ఏడు సంవత్సరాల పాటు పని చేసిన తర్వాత ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ ధ్యేయంగా ఎమ్మెల్సీ బరిలో ఉన్న పట్టబద్రుల సమస్యలపై, నిరుద్యోగుల సమస్యలపై మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ప్రశ్నించే గొంతుకగా రాకేష్ రెడ్డి ని గెలిపించాల్సిన అవసరం మనందరి మీద ఉన్నదని ఎమ్మెల్సీ ఓటర్లను అభ్యర్థించారు.. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తీన్మార్ మల్లన్నకు అలియాస్ (చింతపండు నవీన్) ఓటు వేయవద్దని కోరారు. 56 కేసుల్లో నేర చరిత్ర కలిగి ఉన్న ఒక క్రిమినల్ తీన్మార్ మల్లన్న అని అలాంటి వ్యక్తికి ఓటు వేసి వృధా చేసుకోవద్దని అన్నారు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అదినేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నిరుద్యోగ భృతి ఇస్తున్నామని సభలలో చెబుతుంటే. ఇంకోపక్క నిండు అసెంబ్లీలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నిరుద్యోగ భృతి లేదు అని అన్నారని తెలిపారు. అసలు నిరుద్యోగ భృతి ఉన్నదా లేదా అనే విషయంపై స్పష్టత ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పట్టభద్రులను ఓటు అడగాలని హెచ్చరించారు.

Related posts

నీటి పొదుపు పై అవగాహన కల్పించాలి.డీపీఓ కె. కల్పన .

వరంగల్ జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

అధికారుల పై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి