ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ పొందుటకు హనుమకొండ జిల్లాలోని 10వ తరగతి పాసైన (జి.పి.ఎ. 7.0 ఆపై కలిగిన) దివ్యాంగ విద్యార్థుల నుండి ధరఖాస్తులను కోరుచున్నామని మహిళా, శిశు, వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమశాఖ, హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారిణి మధురిమ తెలిపారు. దరఖాస్తు కొరకు http://telanganaepass.cgg.gov.in అనే ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవలసినదిగా సూచించారు.ధరఖాస్తు నమోదుకు చివరి తేది: 30-05-2024. , అర్హులైన దివ్యాంగ విద్యార్థులు ఇట్టి అవకాశమును సద్వినియోగం చేసుకోగలరని కోరారు.