Jaibharathvoice.com | Telugu News App In Telangana
కాకినాడ

వరదలా ముంచెత్తిన అకాల వర్షం.. పూడిక ముంపుతో జలమయం కాకినాడ కార్పోరేషన్

(

(పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు)
కాకినాడ నగరంలో శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి హైక్లాస్ ఏరియా నుండి మాస్ ఏరియా తేడాలేకుండా స్మార్ట్ సిటీ సర్వం పూడిక ముంపు జలాలతో తల్లడిల్లింది. కార్పోరేషన్ వేసవి ఎండల ప్రారంభంలో చేయాల్సిన పూడిక తొలగింపు తరలింపు పనులను మే నెలాఖ రులో చేపట్టడం వలనలక్షలాది రూపాయల నిధులు మురుగు పాలయ్యాయి. వీధి కాలువల్లో తీసిన ఎక్కడి పూడిక అక్కడే ఉండి పోయింది. వ్యర్థాల తరలింపు జరగలేదు. ప్రధాన రహదారుల్లో ఆర్ అండ్ బి క్రాస్ కల్వర్టుల దిగువ క్లీనింగ్ జరగలేదు. అవుట్ లెట్స్ క్లియరెన్స్ నిర్వహించ లేదు. రేచర్లపేట రైల్వే డ్రైన్ పిడబ్ల్యూడి కాలువ చీడీలపోర మేజర్ డ్రైన్స్ సినిమా రోడ్ కవర్ స్లాబ్ డ్రెయిన్లు ఉప్పుటేరు కాలువ ప్రవాహాల అడ్డగింపు ప్రక్షాళన చేపట్టలేదు. కార్పోరేషన్ ఆర్థికమాంద్యంతో పౌర సౌకర్యాల ముందస్తు ప్రణాళికలు స్తంభించి పోయాయి. ఒక పక్క వీధి దీపాల నిర్వహణ తూ తూ మంత్రంగా తయారయ్యింది. మరోప్రక్క మురుగు కాలువల్లో పూడికతీత అరుంధతీ నక్షత్రంగా మారింది. వేసవి ముందస్తు రిపేర్లు చేయక కుళాయిల్లో త్రాగునీరు సరఫరా నిలిచిపోయింది. ట్యాంకర్ల ద్వారా అందించే ఏర్పాటు సన్నగిల్లింది. జరాసంధుడి శరీరాన్ని చీల్చి పారేసినట్టుగా సినిమారోడ్డు లోని కార్పోరేషన్ ఉన్నతాధి కారుల కార్యాలయం నిర్వహణ నలువై పులకు చెదిరిపోయింది.కో ఆర్డినేషన్ కొరవడింది. రెవిన్యూ పిడబ్ల్యూడి నీటిపారు దల మున్సిపాలిటీ ఆర్ అండ్ బి మున్నగు ప్రభుత్వ శాఖల నడుమ సమన్వయం లేక జిల్లా కేంద్రం మురుగు ముంపుకు వర్షం బెడదకు కునారిల్లు తోంది. అడ్డు అదుపు లేకుండా సిమెంటు రోడ్లు ఎత్తు చేయడం వలన గ్రుహాల లోగిళ్ళు లోతట్టుగా మారి కురుగుతో జల దిగ్భం దనమయ్యాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ప్రభుత్వం కళ్లు తెరవాలని కాకినాడ ముంపు బెడద నివారణకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు.

Related posts

కాకినాడలో విలీనం కోరుతూ పోస్టుకార్డు ఉద్యమం చేపట్టిన రమణయ్యపేట వాసులు

మరిడమ్మతల్లి ఉత్సవం తెలుగింటి ఆషాఢ ఆచారం

ఘనంగా  హేరంబ సంకష్ట హర చతుర్ధి మాసోత్సవం

Sambasivarao