April 13, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

కరెంటు కోతలతో ఎండుతున్న పంటలు

కరెంట్ కోతలతో ఎండుతోన్న పంటలు

త్రాగునీటి సమస్య తో కదిరిపల్లి, ములకనూరు

జై భారత వాయిస్ కళ్యాణ్ దుర్గం,

కరెంట్ కోతలతో కంబదూరు మండలంలో పలు గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయని రైతుల వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే గత మూడు రోజుల క్రితం కదిరిదేవరపల్లి గ్రామానికి చెందిన చిత్తప్ప అనే రైతు తనకున్న వ్యవసాయ పొలంలో టమోటా పంట సాగు చేశారు అయితే తగిన సమయంలో విద్యుత్ సరఫరా అందకపోవడంతో పంట మొలకలొచ్చే సమయంలో ఎండిపోతుందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పలు సమస్యను విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రైతన్నలు మండిపడుతున్నారు. ఇదే పరిస్థితి ములకనూరులో కూడా నెలకొనివుందని ప్రజలు అంటున్నారు ఆ గ్రామంలో విద్యుత్ లేకపోవడంతో ఇంట్లో పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నామని మహిళలు విషయాన్ని మీడియా దృష్టికి తీసుకువచ్చారు. సమస్య ఉన్న చోట పర్యటించాల్సిన కంబదూరు మండలం విద్యుత్ ఏఈ ఇంచార్జ్ పేరుతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు ప్రజలు రైతుల కష్టాలను గుర్తించి సక్రమంగా విద్యుత్ సరఫరాను అందించాలని కోరుచున్నారు.

Related posts

అమిలినేని గృహ నిర్మాణం ప్రాంగణంలో కార్యకర్తలతో కళ కళ

Jaibharath News

అనంతపురం జిల్లాలో పోలీసుల సోదాలు

Jaibharath News

జయం పనింద్ర పర్మిశించిన మంత్రి ఉష చరణ్

Jaibharath News