జై భారత్ వాయిస్ గీసుకొండ
వ్యవసాయ ఖరీఫ్ సీజన్లో రైతులకు కావలసిన వ్యవసాయ వివిధ పంటలకు చెందినటువంటి విత్తనాలను కృత్రిమ కొరత సృష్టించిన నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వర్ధన్నపేట వ్యవసాయ సహాయ సంచాలకులు సురేష్ కుమార్ అన్నారు. గీసుకొండ మండలం కోనాయమాకులలోని రైతు వేదికలో గీసుకొండ మండలంలోని ఫర్టిలైజర్ విత్తన డీలర్లతో వ్యవసాయ శాఖ అధికారులు పోలీసు శాఖ సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వర్ధన్నపేట వ్యవసాయ సహాయ సంచాలకులు సురేష్ కుమార్, గీసుకొండ ఎస్సై జానీ పాషా, మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ బాబు, వ్యవసాయ విస్తరణ అధికారులు మండలంలోని ఫర్టిలైజర్లు విత్తన దుకాణాల డీలర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగానే బీటీ విత్తనాలు 864 రూపాయలు అమ్మాలని అంతకంటే ఎవరు ఎక్కువ అమ్మ రాదని డీలర్లకు సూచించారు విత్తనాలు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ లో విత్తనాలు అమ్మినట్లయితే వారిపై చట్టరీత్యాచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నిషేధిత బిటీ 3 పత్తి వంగడాలను ఎవరు కొనరాదని ఎవరైనా విక్రయించిన వారి సమాచారాన్ని సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు పోలీస్ వారికి అందజేయాలని రైతులకు సూచించారు ఆ విత్తనాలు కొని ఎవరు మోసపోకూడదని అన్నారు మండల వ్యవసాయ శాఖ అధికారి హరిప్రసాద్ బాబు మాట్లాడుతూ విత్తన షాపు డీలర్లు విధిగా స్టాక్ రిజిస్టర్ లను సంబంధిత రిజిస్టర్ లను ఎప్పటికప్పుడు అమ్మకపు వివరాలను నిలువ వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని లైసెన్సులు రైతులకు స్పష్టంగా కలవడే విధంగా ప్రదర్శించాలని అన్నారు. నెలవారి రిజిస్టర్లు విధిగా నమోదు చేయాలని అన్నారు. గడువు మీరు నా విత్తనాలు గాని, రసాయనిక పురుగు మందులు వాటిని నాట్ ఫర్ సేల్ అని రాసి వ్యవసాయ శాఖ అధికారుల సంతకాలు తీసుకోవాలని సూచించారు. గీసుకొండ ఎస్సై షేక్ జానీ పాషా మాట్లాడుతూ నకిలీ విత్తనాలు ఎవరైనా అమ్మినట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని లేదా 100 డైల్ కాల్ చేయాలని అన్నారు. విత్తనాలు నకిలీ విత్తనాలను నకిలీ పురుగుమందులను పట్టుకునేందుకు జిల్లాలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తిరుగుతున్నారని వారికి ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్ముతూ లేదా నాకు పట్టుబడినట్లైతే వారి పైన చట్టరీత్యా చర్య తీసుకోబడతాయని అన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ విస్తరణ అధికారులు రజిని, విజయ్, కావ్య, తిరుపతి, తేజస్విని, ప్రజ్వల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధి రాంబాబు తదితరులు పాల్గొన్నారు
next post