Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జై భారత్ వాయిస్ దుగ్గొండి
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావిలోని
మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్  కూరోజు దేవేందర్ అధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ శ్రీ కూరోజు దేవేందర్  మొదట అంబేద్కర్,జ్యోతిబా ఫూలే, మహత్మా గాంధీ,జయశంకర్ సార్, కాళోజీ,శ్రీకాంతాచారి చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి , జాతీయ జెండా ఆవిష్కరించి అమరవీరులకు ఘనమైన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కూరోజు దేవేందర్ మాట్లాడుతూ దశాబ్దాలుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో ఎందరో వీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, ఎందరో మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ ,బియ్యాల జనార్ధన్ లాంటివారు తన జీవితాన్ని త్యాగం చేశారని, జయశంకర్ సార్ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని ,అటువంటి జయశంకర్  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తరువాత లేకపోవడం బాధాకరమని, ప్రొఫెసర్ జయశంకర్  తోటి ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎందరో త్యాగాల, పోరాటాల ఫలితం అని ,ఎన్నో ఉద్యమాల తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ గా మార్చడంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ప్రిన్సిపాల్  పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి  ఇంచార్జీ ఏటీపీ ప్రభాకర్  వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ వార్డెన్ సుకుమార్, బిల్డింగ్ ఓనర్ బైరెడ్డి రాజేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు సోమారాణి,రాజు, సమత,శారద, కోటి, కిరణ్ , రమేష్,కృష్ణమూర్తి,లక్ష్మణ్, బషీరుద్దీన్ ,వీరేందర్, సందీప్,సతీష్, ప్రేమలత, నాన్ టీచింగ్ సిబ్బంది ఉస్మాన్,శ్రీను,నరేష్, రాజశేఖర్ లు పాల్గొన్నారు

Related posts

శివనగర్ లోని అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు

ఆయిల్ పామ్ సాగు బిందుసేద్య నిర్వహణపై శిక్షణ

ప్రభుత్వ ఉన్నత పాఠశాల శివ నగర్ లో కిశోర బాలికల పోషణ అవగాహన కార్యక్రమం

Sambasivarao