Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతఆత్మకూరు ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి

(జై భారత్ వాయిస్  ఆత్మకూరు):
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా స్వీకరించి మొక్కలు నాటాలని ఆత్మకూరు ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.  ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని  గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీడీఓ మాట్లాడుతూ వాతావరణం కాలుష్యం పెరగడంతో ఎండలు మండుతున్నాయన్నారు. వాటిని నివారణకు మొక్కలు  నాటడంతోనే ఎండ తీవ్రతను తగ్గించుకోవచ్చు అన్నారు. ప్రభుత్వం అమృత్స రోవర్ ప్రోగ్రాం కింద 8 గ్రామాలను ఎంపిక చేసి మొక్కలు నాటడం జరిగిందన్నారు. ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాలని, మొక్కలను పెంచుకోవడం బాధ్యతగా తీసుకోవాలన్నారు. అప్పుడే సకాలంలో వర్షాలు కురుస్తాయని రైతులకు వాతావరణం అనుకూలంగా ఉంటుందన్నారు. నిర్లక్ష్యం చేస్తే మానవాళికే పెనుముప్పుగా మారుతుందని ఎంపీడీఓ  అన్నారు. తొలుత మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏపీవో రాజిరెడ్డి, రాష్ట్ర ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత పర్వతగిరి రాజు,  గ్రామ పంచాయతీ కార్యదర్శి మేడ యాదగిరి, ఈసీలు సురేష్, శ్రీధర్, సుధాకర్, స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు నాగ బండి శివప్రసాద్, మాజీ వార్డ్ మెంబర్లు ఆశా వర్కర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.

Related posts

అభివృద్ధి పనులే లక్ష్యంగా ఎమ్మెల్యే నాయిని పర్యటన

Sambasivarao

శాయంపేట లోని శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు

మత్స్యకారుల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం..