తొలకరి జల్లులకు.. వ్యాధులు సోకుతాయి
హనుమకొండ జిల్లా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ యాకూబ్ పాషా
( జై భారత్ వాయిస్ ఆత్మకూరు)
తొలకరి జల్లులు కురిసే వర్షాకాలం లో సీజనల్ వ్యాధులతో పాటు చిన్నపిల్లలు అనారోగ్యాల కు గురి గాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా డిప్యూటీ డిఎమ్హెచ్వో డాక్టర్ యాకూబ్ భాష అన్నారు. గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చుట్టూ పరిసరాలను పరిశీలించి తనిఖీలు చేశారు. ఆరోగ్య కేంద్రం కు వచ్చిన పిల్లల వైద్య సేవలు అందించారు. అనంతరం డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ యాకుబ్ పాషా మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని నిరుపేదలందరికీ ఉచితంగా వైద్య సేవలు ఎంతో అంకితభావంతో అందించాలన్నారు. డెలివరీ లు కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. మీకు కావాల్సినవి వైద్య సిబ్బందితోపాటు కావలసిన మందులను ఏర్పాట్లను చేస్తామని తెలిపారు.గ్రామీణ ప్రాంతాలలోని మహిళలకు అందుబాటులో వైద్య సేవలు ఉండాలని సూచించారు. డాక్టర్ స్పందన సేవలు బేష్ అని అభినందించారు ఏఎన్ఎంలు గ్రామాలు తిరుగుతూ రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు. డెమో అశోక రెడ్డి మాధవరెడ్డి, డాక్టర్ స్పందన, వైద్య సిబ్బంది చర్చలు పాల్గొన్నారు
previous post